తామరలో చాలా రకాలు ఉంటాయి.ఎటోపిక్ ఎగ్జిమా కి సామాన్యమైన కారణం డ్రై స్కిన్. ఈ కండిషన్ ఉన్న వారు చర్మం పై లేయర్స్ కి తేమని లాగలేరు. ఇందువల్ల వివిధ రకాల కారణాల వల్ల స్కిన్ త్వరగా ఇరిటేట్ అవుతుంది, పరిస్థితి తీవ్రమవుతుంది. ఈ కారణాల్లో దుమ్ము, పుప్పొడి, పెర్ఫ్యూంస్ వంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మాత్రమే కాక, సీఫుడ్, నట్స్, వెజిటబుల్స్ వంటి ఫుడ్ కి సంబంధించిన కారణాలు కూడా ఉంటాయి.
అయితే, చెమట, ఒత్తిడిని ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రధాన లక్షణాల్లో స్కిన్ యొక్క డ్రైనెస్, ఎర్రదనం, దురద కూడా ఉంటాయి. అయితే, సీబం ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం తో కూడా అసోసియేట్ చేయవచ్చు కానీ ఇది చాలా అరుదు అని నిపుణులు అంటున్నారు.
ఒక జీన్ వేరియేషన్ వల్ల ఈ కండిషన్ వస్తుంది, కాబట్టి దీనికి క్యూర్ లేదు. అయితే, దీని లక్షణాలను మాత్రం ఆయింట్మెంట్స్, ఓరల్ మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేయవచ్చు. అలాగే, కొన్ని జీవన శైలి మార్పులు కూడా అవసరమవుతాయి. ఇవి కాక చర్మం ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవడం, పడని వాటికి దూరంగా ఉండడం అవసరం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి