పోహా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో 70 శాతం ఆరోగ్యకరమైన కార్పోహైడ్రేట్స్ ఇంకా 30 శాతం కొవ్వు పదార్థాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇందులోని పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.మధుమేహం కంట్రోల్‌లో ఉండాలంటే అన్నం, ఇడ్లీ, దోసెల కంటే పోహా మేలు. ప్రముఖ వైద్యులు బేబ్జానీ బెనర్జీ ప్రకారం.. పోహాలో ప్రోబయోటిక్స్, B విటమిన్లు, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇది వైట్ రైస్ కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. బియ్యంలో సాధారణంగా ఫైబర్ తక్కువగా ఉంటుంది. తక్కువ ప్రోటీన్‌తో కార్పోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.పోహాలో బఠానీలు, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, కొత్తిమీర, కరకరలాడే వేరు శెనగ వంటి అనేక కూరగాయలతో తయారు చేయొచ్చు. వీటిని అందులో వేయడం వలన పోహా మరింత పోషకాలతో కూడిన వంటకం అవుతుంది. పోహా తినడం వలన పొట్ట లైట్‌గా ఉంటుంది. తేలికగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో దీనిని తినొచ్చు.కూరగాయలు మిక్స్ చేసి తయారు చేసిన ఒక ప్లేట్ పోహాలో 250 కేలరీల శక్తి ఉంటుంది.


అనేక విటమిన్లు, ఖజినాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. ఇందులో వేరు శెనగలు, క్యారెట్స్, బీన్స్ కూడా వేయడం వలన యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్స్ శరీరానికి అందుతుంది.శరీరంలో అదనపు కొవ్వును తగ్గించుకోవాలనుకునేవారు, ఎసిడిటీ వంటి సమస్య రాకుండా ఉండాలంటే.. పోహా సరైన ఆహారం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారంగా పోహా తినడం వలన మేలు జరుగుతుందని చెబుతున్నారు.పోహా తినడం వలన జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. తేలికపాటి అల్పాహారం కావడంతో, ఇది సులభంగా జీర్ణం అవుతుంది. కడుపు ఉబ్బరం, ఆయాసం వంటి సమస్యలు రావు. తేలికగా అరుగుతుంది.పోహాలో ఉండే ప్రోబయోటిక్స్.. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దేశీ, ఎరుపు పోహాలో జింక్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: