వంట సోడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.వంటసోడా కలిపిన గోరు వెచ్చని నీటిని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. వంటసోడా మనకు డియోడ్రెంట్ గా కూడా పని చేస్తుంది. వంటసోడాలో కొద్దిగా నీటిని పోసి కలుపుకోవాలి. దూదిని తీసుకుని ఈ మిశ్రమంలో ముంచి శరీరంలో చెమట, దుర్వాసన వచ్చే చోట రాయాలి. ఇలా చేయడం వల్ల శరీరం నుండి దుర్వాసన రావడం తగ్గుతుంది. అదే విధంగా వంటసోడా కలిపిన నీటితో చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల క్రిములు నశించి చేతులు శుభ్రపడతాయి. మనం వంటసోడాను ఉపయోగించి మనం ముఖ అందాన్ని పెంచుకోవచ్చు. వంటసోడా చక్కటి ఫేషియల్ స్క్రబర్ లా కూడా పని చేస్తుంది.క్యాన్సర్ ఉన్న వారికి వంటసోడా ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ వంటసోడాను కలిపి తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుండి ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.


అదే విధంగా నీటిలో వంటసోడాతో పాటు తేనె, నిమ్మరసం కలిపి ఒక వారం రోజుల పాటు పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులను మనం గమనించవచ్చు. వంటసోడాలో ఉండే రసాయనిక లక్షణాలు మనల్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి యాంటీ బయాటిక్ గా పని చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణమవుతాయి.పొడి చర్మం ఉన్న వారికి వంటసోడా చక్కటి వరంలా పని చేస్తుంది. ఒక గిన్నెలో వంటసోడాను, తేనెను వేసి పేస్ట్ లా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేషియల్ ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ టిప్ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చడంతోపాటు చర్మంపై ఉండే మొటిమలను కూడా తగ్గిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: