ప్రస్తుత ఆహారాలవాట్లు, జీవన విధానం వల్ల చాలామందికి చిన్నవయసులోనే తెల్ల జుట్టు సమస్య కనిపిస్తోంది.ఇంకొంతమందికి తల మొత్తం తెల్లగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.వీరు నలుగురితో కలవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఈ ఆత్మ న్యూనత నుండి వారి పిల్లలను కాపాడుకోవడానికి జుట్టుకు రంగు వేస్తూ, వెంట్రుకలను మరింత పాడుచేస్తుంటారు.కానీ చిన్న వయసులోనే జుట్టు గ్రే గా మారుతువుంటే,అందుకు గల కారణాలను పరిశీలించాలి.దానికి తగినట్లుగా జీవన విధానంలో, ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని, వైద్య నిపుణులు సూచిస్తూంటారు.

  సాధారణంగా తెల్ల జుట్టు రావడానికి ముఖ్య కారణం  మన వెంట్రుకలలోని నల్లగా ఉండడానికి కారణమైన మెలనిన్ తగ్గిపోవడం. మెల్లనిన్ తగ్గడానికి చాలా కారణాలే ఉన్నాయి.అవేంటంటే ఇప్పుడు చూద్దాం ..

చాలామంది చిన్న వయసులోనే ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురవడం,  జంక్ ఫుడ్ తినడం,పోషకాహార లేమివంటి వాటి వల్ల మన శరీరంలోని న్యూట్రియంట్లు తగ్గిపోతాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.

 కొంతమందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, సరైన జీవన విధానం జీవిస్తూ ఉన్న  సరే.. జుట్టు తెల్లబడుతుంది. దీనికి కారణం వంశ పర్యాపారం జన్యువులు కూడా కావచ్చు. తల్లిదండ్రులకు కానీ, తాత ముత్తాతలు గాని ఇలాంటి వంశపారంపరమైన సమస్య ఉంటే పిల్లలకు వస్తుంది.
 జుట్టు మెల్లగా మారడానికి ఏమేమి ఆరోగ్య విధానాలు పాటించాలో చూద్దాం.

మనం అన్ని పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి.విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, క్యాల్షియం, ఇతర సూక్ష్మ పోషకాలు ఉండే ఆహారాన్ని రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి.దీంతో పాటు, జంక్ ఫుడ్ అలవాట్లకు దూరంగా ఉండాలి.
 జుట్టు తెల్లబడడానికి మరొక కారణం ఒత్తిడి. వీలైనంతవరకు ఒత్తులు తగ్గించుకొని సరైన ఆహారం అలవాట్లు అలవర్చుకుంటే,తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 చిన్నపిల్లల తలస్నానం చేపించేందుకు వాడే షాంపూలు, కండిషనర్స్ లో ఉండే కెమికల్స్ పిల్లల జుట్టు ఇంకా పాడుచేస్తాయి. అందుకే వీలైనంత వరకు  నాచురల్ ప్రొడక్ట్స్  వాడాలి.

 పిల్లల జుట్టు నల్లగా మారడానికి, తరచూ ఆముదం పెట్టడం, దువ్వుకోవడం, వారానికి రెండు సార్లైనా కుంకుడు కాయలతో స్నానం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: