ఇక ఈ రోజుల్లో చాలా మందికి కూడా చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా డయాబెటిస్ వస్తోంది. అందుకు సక్రమంగా లేని జీవన విధానమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇలా జరుగుతుండడం వల్ల టైప్ 1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఎవరైనా సరే డయాబెటిస్ ను పూర్తిగా నియంత్రించాలి. లేదంటే వారి  వంశానికి కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక కింద తెలిపిన  ఆహారాలను ప్రతి రోజూ తీసుకుంటే షుగర్‌ను చాలా సులభంగా కంట్రోల్ చేయవచ్చు. ఇక అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.చిరు ధాన్యాలు మధుమేహ నియంత్రణకి మంచి ఆహారం. ఇక వాటిల్లో రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి మధుమేహాన్ని అరికట్టడానికి చాలా ముఖ్యమైనవి. వీటిని పూర్వ కాలంలో మన పెద్దవారు తినేవారు. అందుకే వారికి వయస్సు మీద పడినా కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కావు. అయితే వీటిని తీసుకోవడం వల్ల షుగర్ చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది. అలాగే వీటిని నేరుగా కూడా వండుకుని తినవచ్చు.


అలాగే పిండి చేసి రొట్టె రూపంలో కూడా తినవచ్చు.ఇంకా జావ, సూప్ తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా షుగర్ చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది. రోజుకి 2 పూటలు ఈ ఆహారాలను మాత్రమే తీసుకుంటే దీంతో షుగర్ ఆటోమేటిగ్గా అదుపులోకి వస్తుంది.అలాగే వీటితోపాటు బార్లీ, ఓట్స్ లాంటి తృణ ధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజుకు 2 పూటల పాటు చిరు ధాన్యాలను అలాగే ఒక పూట తృణ ధాన్యాలను తినాలి. ఇలా తింటే షుగర్ చాలా ఈజీగా అదుపులోకి వస్తుంది. బార్లీ వంటి వాటిని జావలాగా చేసుకుని తినవచ్చు. అలాగే ఓట్స్‌ను ఉప్మా లాగా వండుకుని కూడా తినవచ్చు. దీంతో పోషకాలు లభించడమే కాదు ఇంకా షుగర్ లెవల్స్ కూడా ఈజీగా తగ్గుతాయి. ఇలా ఈ ఆహారాలను ప్రతి రోజూ తీసుకుంటే షుగర్ దెబ్బకు ఈజీగా కంట్రోల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: