అల్లం తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాల ?

అల్లం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు.కానీ అల్లంలో ఉండే ఔషద గుణాలు మీలో ఎంతమందికి తెలుసు?అల్లం బిర్యాని చేయడంలో,చికెన్,మటన్, కూరలలో వేసే ఒక మసాలా అని మాత్రమే తెలుసు.కానీ దీన్ని తినటం వల్ల కలిగే ప్రయోజనాలు మనలో కొంతమందికి మాత్రమే తెలుసు.దీనిలో యాంటిమెటిక్ పుష్కళంగా ఉండటం వల్ల దగ్గు,తలపోటు,గొంతునోపి,జలుబు వంటి సమస్యలనుండి ఉపశమనం లభిస్తుంది.గొంతునొప్పి తలనొప్పి తరచూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వెంటనే ఒక చిన్న అల్లం ముక్క టీ లో మరగించి ఆ టీ తాగడం వల్ల వెంటనే ఆ సమస్య నుండి బయటపడతారు.దగ్గు జలుబుతో ముక్కుదిబ్బడ ఎక్కువగా బాదిస్తుంటే వెంటనే ఒక గ్లాస్ పాలలో చిటికెడు పసుపుతో పాటు ఒక ముక్క అల్లం వేసి బాగా కాచి తాగితే ముక్కుదిబ్బడ వదిలి,దగ్గు జలుబు తగ్గుమోహం పడతాయి.ఇలా రోజుకి రెండు సార్లు తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది.


ఆడవారిలో నెలసరి సమయంలో వచ్చే తిమ్మిర్లు అధిక రక్తస్రవం కాకుండా కంట్రోల్లో ఉంచుతుంది.దీన్ని రోజు ఆహారంలో చేర్చి తీసుకుంటే జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది.చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది.అల్లం తరచుగా తీసుకోవడం వల్ల మగవారిలో శుక్రకణాల సంఖ్య మెరుగుపడుతుంది.అంతే కాకుండా ఆరోగ్యాకరమైన నాణ్యత గల శుక్రకణాలు తయారావుతాయి.అంతేకాదు రక్తపోటును తగ్గించి రక్తాన్ని శుద్ధిచేసి రక్తంలోని మాలినాలని బయటకి తరిమికొడుతుంది.వ్యర్థ పదార్దాలను చెడు కొలస్ట్రాలను కరిగించడంలో ఎంతో సహాయాడుతుంది.శరీర బరువును తగ్గించి శరీర ఉష్ణోగ్రత పెంచుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అల్లంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి.దీనిలో ఆకలిని తగ్గించే గుణాలు ఉండటం వల్ల అధిక బరువుని నివారిస్తుంది.వికారం వాంతులు అవుతునట్టు ఉంటే అల్లంతో మరిగించిన నీళ్లు తాగటం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.సంతానలేమి సమస్యకు కూడా ఈ అల్లం చాలా ఉపయోగపడుతుంది.చూసారా అల్లం రుచికే కాదు ఆరోగ్యానికి అందానికి కూడా అవసరానికి మన వంటగదిలో అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: