సాధారణంగా ఇంట్లో ఏదైనా చెత్త ఉంటే ఏం చేస్తాం. ఒక ఖాళీ సమయం చూసుకొని ఆ చెత్తని బయటపడేస్తూ ఉంటాం.  పనికిరాని వస్తువులని పనికిరాని సామాన్లని ఇంట్లో క్లియర్ చేసేస్తూ ఉంటాం . తద్వారా ఇల్లు క్లీన్ గా ఉంటుంది చూడడానికి చక్కగా ఉంటుంది . అదేవిధంగా ఫోన్స్ లో అయినా కూడా.  ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిన వెంటనే క్లియర్ చేసేస్తాం.  మొబైల్ స్పీడ్ గా వర్క్ చేస్తుంది . మరి మన శరీరంలోని మలినాల సంగతి ఏంటి ..? పేగులు రక్తనాళాలు అనే తేడా లేకుండా పెరుగుతున్న అవశేషాలు ..రసాయన వ్యర్ధాలు వంటివి ఎలా బయటకు రావాలి . బాగుంది కదా అని ఫంక్షన్ కి వెళ్తే బిర్యానీలు కుమ్మేస్తుంటాం.  బిర్యాని అరగాలి కదా అని సోడాలు తాగేస్తున్నాం. నిద్రలేసి లేవగానే  కడుపులోకి టీ పోవాలి అంటూ చిక్కటి పాలతో చక్కటి టీ పెట్టుకుని తాగేస్తున్నాం . ఇలా మన ఆహారపు అలవాట్లు మన శరీరంలో చెత్తను పేరుకుపోయేలా చేస్తూ ఉంటుంది . అయితే వాటిని ఎలా తొలగించాలి..? ఎలా తుడిచిపెట్టుకుపోయేలా..? చేయాలి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


ఈ మధ్యకాలంలో చాలామంది బయట ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  చేతిలో డబ్బుంది..  ఆర్డర్ పెడితే ఏదైనా ఇంటికి ముందుకు వస్తుంది అన్న బద్ధకమో  లేకపోతే..  బయటఫుడ్  తినాలి అన్న కోరికో.. రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేయని వాళ్ళు జొమాటో.. స్వీగీ లాంటి వాటిల్లో ఆర్డర్ పెట్టుకొని సెకండ్స్ లోనే  ఇంటి ముందుకి డెలివరీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు . ఆ ఫుడ్స్ ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు కొంతమంది డైలీ అదే అలవాటుని కంటిన్యూ చేస్తూ వస్తారు . మరి ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్.. ఫ్రైడ్ ఫుడ్ ..శరీరం మీద దృష్టి ప్రభావం ఎక్కువగా చూపుతుంది అంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు .



వీటి కారణంగా పేగులు , కాలేయం , మూత్రపిండాలు , రక్తనాళాలలో వివిధ శరీర భాగాలలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది.  ఫలితంగా మధుమేహం ..ఒబిసిటీ ..రక్తపోటు ..గుండెజబ్బులు.. థైరాయిడ్ తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నేటి సమాజంలో చిన్నపిల్లలకి సైతం గుండెజబ్బులు వచ్చేస్తున్నాయి. బాగా తినేయడం .. దానికి తగ్గట్టు వర్కౌట్ చేయకపోవడంతో బాడీలోని కొవ్వు ఎక్కడికక్కడ పేరుకుపోతూ ఉంటుంది.  ఆ కారణంగా అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి . అయితే దీనికోసం మనం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు.  మన ఇంట్లో ఉండే వాటితోనే చిన్న చిట్కాలు ఫాలో అవుతూ..  మన జీవన శైలిలో మార్పులు తీసుకొస్తూ ఆహార పద్ధతులను శరీరంలో చేరిన విష పదార్థాలను తొలగించవచ్చు అంటూ నిప్పుణులు  చెప్పుకొస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు ఎక్కడ చదివి తెలుసుకుందాం..!!



* ఏ ఫుడ్ అయినా సరే అతికి మించి తినకూడదు . ఎంత బాగున్నా ఎంత ఇష్టమైన సరే.. లిమిట్స్ లో తినాలి.
* రాత్రి ఆరు , ఏడు తర్వాత ఎక్కువ భోజనం చేయకపోవడం మంచిది . లైట్ డిన్నర్ తో కంప్లీట్ చేస్తే ఇంకా ఇంకా మంచిది.
* జీర్ణ వ్యవస్థను గాడిన పెట్టాలి అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లు ,కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి . చిరుధాన్యాలు ఆహారంలో భాగం చూసుకోవాలి
* వయసు ఆరోగ్య పరిస్థితులు శారీరక సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని వారానికో 15 రోజులకు ఒక పూట పూర్తిగా ఉపవాసం చేయకపోయినా రెండు పూటలు ఉపవాసం చేయడం మంచిది.
*మనం తినే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు కాయకూరలు ఉండేలా చూసుకోవాలి. ఇంకా ముఖ్యంగా పచ్చి కాయగూరలు తింటే మరీ మరీ మంచిది.
*నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి.. తద్వారా బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్న బయటకు వెళ్లి పోతుంది.
*శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలి . ఉదయం లేదా సాయంత్రం కనీసం అరగంటపాటైన వ్యాయామం చేయాలి.
*బొప్పాయి లో ఉండే పఫైన్ అనే ఎంజైమ్ హార్మోన్లకి సహకరిస్తుంది . కాలేయంపై జీవక్రియ భారం తగ్గుతుంది.
*మూత్రపిండాన్ని శుభ్రం చేయడంలో దానిమ్మ పాత్ర కీలకం.  అందులో యాంటీ ఆక్సిడెంట్లు  ఎక్కువగా ఉంటాయి . మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.
* పంచదార, ఊరగాయ , ఉప్పు నూనె కొవ్వులతో కూడిన ప్రాసెస్డ్ ఆహారం ఆల్కహాల్ బాగా వేయించిన ఆహారం శీతల పానీయాలకు దూరంగా ఉండటం మరీ మరీ మంచిది.
* డీ టాక్సినేషన్ పానీయాలు మనం రోజు తీసుకునే ఆహారంలో బాగాలే మరి ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి వృద్దుల వరకు వాళ్ళు అవసరాలకు వయసు బట్టి చిన్నటి మోతాదులో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
రోజుకి 200 ఎం ఎల్ వరకు తీసుకోవచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు. కొందరికి కొన్ని కొన్ని పదార్థాలు పడకపోవచ్చు.  ఆ కారణంగా ఒకటే పానీయాన్ని పదే పదే తాగకుండా మార్చి మార్చి తాగుతూ ఉండడం కూడా ఇంకా మంచిది . ఎక్కువగా నీళ్లు తీసుకోవడం అతికి మించిన ఆహారం తీసుకోకపోవడం ..బయట దొరికే ఫ్రైడ్ ఫుడ్శ్ తినకపోవడం ఇంకా ఇంకా మంచిది అంటూ నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కూడా క్రమ క్రమంగా తగ్గిపోతూ హెల్తీగా ఆరోగ్యకరంగా ఉండొచ్చు అంటూ చెబుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: