మనలో చాలామంది ఉల్లిపాయలు కోసే సమయంలో కన్నీళ్లు రావడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉల్లిపాయలు కోసే సమయంలో కన్నీళ్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు. సాధారణంగా ఉల్లిపాయలలో లాక్టేమేటరీ ఫాక్టర్ సింథేస్ అనే ఎంజైమ్ లు ఉంటాయి. మనం ఉల్లిపాయలు కోసిన సమయంలో ఈ ఎంజైమ్స్ విడుదలై మన కళ్లపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఉల్లిపాయలను కోసే ముందు ఫ్రిజ్‌లో ఉంచడం లేదా చల్లటి నీటిలో నానబెట్టడం చేయడం ద్వారా కన్నీళ్లు రాకుండా ఉంటాయి. పదునైన కత్తితో కోయడం, చూయింగ్ గమ్ నమలడం, లేదా గ్యాస్ స్టవ్ లేదా కొవ్వొత్తి మంట దగ్గర కోయడం వంటి  పనులు చేయాలి.  ఉల్లిపాయలను కోసే ముందు చల్లటి నీటిలో 5 నుంచి 10 నిమిషాలు నానబెడితే  ఘాటు తగ్గడంతో పాటు కన్నీళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.

పదునైన కత్తితో కోయడం వల్ల ఉల్లిపాయ కణాలు తక్కువగా దెబ్బ తినే ఛాన్స్ తగ్గడంతో పాటు  కన్నీళ్లు వచ్చే ఛాన్స్ అయితే తగ్గుతుందని చెప్పవచ్చు.  ఉల్లిపాయలను కోసేటప్పుడు చూయింగ్ గమ్ నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి అయ్యి  ఇది కళ్ళలోకి వెళ్ళే వాయువులను గ్రహించి కన్నీళ్లు వచ్చే ఛాన్స్  తగ్గుతుంది.  

ఉల్లిపాయలను కత్తిరించేటప్పుడు గ్యాస్ స్టవ్ లేదా కొవ్వొత్తి మంటకు దగ్గరగా ఉంచడం వల్ల ఉల్లిపాయలోని సల్ఫర్ ఆవిరి మంటలో  కలిసిపోవడం వల్ల కన్నీళ్లు వచ్చే ఛాన్స్ ఉండదు.  వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే, అది ఉల్లిపాయల నుండి వచ్చే వాయువులను బయటకు పంపి, కన్నీళ్లు రాకుండా చేయడంలో దోహదపడుతుందని చెప్పవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: