మార్చ్ 14 వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి ఈ రోజు చరిత్రలో కి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 శంషాబాద్ ఎయిర్ పోర్ట్  : హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతులమీదుగా 2008 మార్చి 14వ తేదీన ప్రారంభించబడింది. 

 

 కొక్కొండ వెంకటరత్నం పంతులు జననం : పత్రికా సంపాదకులు ఉపాధ్యాయులు సంగీతజ్ఞులు అయిన కొక్కొండ వెంకటరత్నం పంతులు 1842 మార్చి 14వ తేదీన జన్మించారు. ఈయన గ్రాంధికం తప్ప ఇతర భాష మాట్లాడేవారు కాదు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునిక ఆంధ్రుల లలో రెండో వ్యక్తిగా ఘనత సాధించారు కొక్కొండ వెంకటరత్నం పంతులు. కొక్కొండ వెంకటరత్నం పంతులు ఆంధ్ర జాన్సన్ అనే గౌరవం పొందిన పండితులు. ఆంధ్ర  నవ యుగ ప్రవర్తక త్రయం చిన్నయసూరి,  వెంకటరత్నం,  వీరేశలింగం లలో ఈయన మధ్య స్థానాన్ని ఆక్రమించిన వారు. ఏదైనా 1871లో ఆంధ్రభాషా సంజీవని అనే పత్రికను 20 సంవత్సరాల పాటు నడిపారు. చెన్నైలో ఆంధ్రులు చేత నడుపబడుతున్న పత్రికలు ఇదే మొదటిది కావడం గమనార్హం. ఇక ఆ తర్వాత హాస్య వర్ధని అనే పత్రికను కూడా నడిపారు కొక్కొండ వెంకటరత్నం పంతులు. 

 


 ఆల్బర్ట్ ఐన్స్టీన్ జననం : జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాలు లో ఒకటైన జనరల్ ఆఫ్ రిలేటివిటి ని  ప్రతిపాదించారు ఐన్స్టీన్. తత్వ శాస్త్రంలో కూడా ప్రభావవంతమైన కృషి చేశారు ఈయన. ఈయన 1879 మార్చి 14వ తేదీన జన్మించారు. ఇక 1921లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ప్రస్తుతం ఐన్స్టీన్  అందించిన ఎన్నో సూత్రాలు ఫార్ములాలు నేటి తరంలో కూడా ఉపయోగపడుతున్నాయి. 

 

 కె వి మహదేవన్ జననం : సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు అయిన కె.వి.మహదేవన్ 1917 మార్చి 14వ తేదీన జన్మించారు. తమిళనాడుకు చెందిన v MAHADEVAN' target='_blank' title='కె వి మహదేవన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కె వి మహదేవన్ ఎక్కువగా తెలుగు చిత్రాలకు సంగీతం అందించారు. v MAHADEVAN' target='_blank' title='కె వి మహదేవన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కె వి మహదేవన్ కుటుంబమంతా సంగీతమయమే . v MAHADEVAN' target='_blank' title='కె వి మహదేవన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కె వి మహదేవన్ తాతగారి కాలం నుంచే సంగీతంలో రాటుదేలిన కుటుంబం కె.వి.మహదేవన్ ది.  మహదేవన్ మిత్రుడు ఇచ్చిన    సలహామేరకు సంగీత దర్శకుడిగా అవతారమెత్తాడు కె.వి.మహదేవన్. ముందుగా తమిళం సినిమాల్లో  సంగీత దర్శకుడిగా పరిచయమైన కె.వి.మహదేవన్.. దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాకు తొలిసారిగా తెలుగులో స్వరాలు అందించారు. ఇక అదే సంవత్సరం ముందడుగు సినిమాతో కె.వి.మహదేవన్ ప్రతిభ బయటపడింది. ఇక ఆ తర్వాత 1962లో విడుదలైన మంచి మనుషులు సినిమా కేవలం కె.వి.మహదేవన్ అందించిన స్వరాలు కారణంగానే మంచి విజయం సాధించింది అంటూ ఉంటారు. ఈయన  తెలుగు సినిమా సంగీతంలో ఓ కొత్త భావానికి ఊపిరి పోశారు అనే చెప్పాలి. ఆయనకు తెలుగు రాదు అయినా  సంగీతానికి భాష అనేది అవసరం లేదు అంటూ నిరూపించారు. 

 


 నాయని కృష్ణకుమారి జననం : ప్రముఖ తెలుగు రచయిత అయిన నాయని సుబ్బారావు కుమార్తె నాయని కృష్ణకుమారి. ఈమె  1930 మార్చి 14వ తేదీన జన్మించారు. ఈమె ఎన్నో రచనలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అగ్ని పుత్రి,  ఏం చెప్పను నేస్తం,  పరిశీలన,  పరిశోధన ఇలా ఎన్నో రచనలను తెలుగు ప్రజలకు అందించారు నాయని కృష్ణకుమారి. 

 

 జొన్నలగడ్డ గురప్ప శెట్టి జననం : చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారుడు అయిన జొన్నలగడ్డ గురప్ప శెట్టి 1937 మార్చి 14వ తేదీన జన్మించారు. ఈయన  చేసిన సేవలకుగాను... భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారంతో పాటు పద్మశ్రీ పురస్కారం తో కూడా సత్కరించబడ్డారు జొన్నలగడ్డ గుర్రప్ప శెట్టి. 

 

 కార్ల్  మార్క్స్  మరణం : జర్మన్ శాస్త్రవేత్త, తత్వవేత్త మరియు ఆర్థికవేత్త,  సామాజికవేత్త పాత్రికేయుడు, విప్లవకారుడు అయిన కార్ల్ మార్క్స్ 1883 మార్చి 14వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: