గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో న‌వంబ‌ర్ 24వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు
1997: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు.

ప్ర‌ముఖుల జననాలు


1880: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (మ.1959)
1897: వంగర వెంకటసుబ్బయ్య, హాస్యనటుడు. (మ.1976)
1924: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకుడు. (జ.1992)
1929: భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. హస్య రచయిత. (మ.2007) నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ప్రోద్బలంతో సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో కె.విశ్వనాథ్‌ తొలి చిత్రమైన ఆత్మగౌరవం కూడా ఉంది. బ్రహ్మచారికథానాయకుడుకీర్తిశేషులుమరపురాని కథవిచిత్ర కుటుంబంపల్లెటూరి బావఎదురులేని మనిషిగోవుల గోపన్నసీతారామ కళ్యాణంనారీనారీ నడుమ మురారికాలేజీ బుల్లోడు వంటివితో సహా తెలుగు చిత్రాలకు కథలు వ్రాశారు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లకు ఆయన సన్నిహితుడు. 1994 తర్వాత క్రమంగా ఆయన సినిమా రంగానికి దూరమయ్యారు.
1952: బ్రిజేష్ పటేల్, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1953: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు.
1955: ఇయాన్ బోథం, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1961: అరుంధతీ రాయ్, భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి.

ప్ర‌ముఖుల మరణాలు

1981: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (జ.1897)
2018: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (జ.1952)


పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ ఎవల్యూషన్ డే.

మరింత సమాచారం తెలుసుకోండి: