గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మే 7వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు..

1924: అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్‌చే బంధించబడ్డాడు.
1946: సోని కార్పొరేషన్ జపాన్ లో స్థాపించారు.

ప్ర‌ముఖుల జననాలు

1909లో రవీంద్రనాథ్ టాగూర్.భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్. ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం.
1711: డేవిడ్ హ్యూమ్, స్కాటిష్ ఆర్థికవేత్త, చరిత్రకారుడు, తత్త్వవేత్త (మ. 1776)
1812: రాబర్ట్ బ్రౌనింగ్, ఆంగ్ల కవి (మ. 1889)
1861: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (మ.1941)
1921: ఆచార్య ఆత్రేయ, తెలుగు నాటక, సినీ రచయిత. (మ.1989)

ప్ర‌ముఖుల మరణాలు..

1920: హెచ్.వి.నంజుండయ్య, మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (జ.1860)
1924: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)
1964: పసుపులేటి కన్నాంబ, రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి .
1972: దామోదరం సంజీవయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1921)
1973: శివ్ కుమార్ బటాల్వి, పంజాబీ భాషా కవి. (జ.1936)
2016: బోయ జంగయ్య, రచయిత. (జ.1942)
2019: గుండా రామిరెడ్డి తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. (జ.1919)

పండుగలు , జాతీయ దినాలు

ఠాగూర్ జయంతి.
నవ్వుల దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: