
కటాసరాజ మందిరం:
కటాసరాజ మందిరం ఒక శివ క్షేత్రం. ఇది పాకిస్తాన్ లో పంజాబ్ రాష్ట్రంలో ఉన్న చక్వాల్ జిల్లాలోని , చో సైదాన్షా పట్టణానికి సమీపాన కటాస్ గ్రామంలో ఈ శివ క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. మహాభారతంలోని పాండవులు వనవాసంలో భాగంగానే ఇక్కడ కొద్దిరోజులు నివసించారు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ మందిరాన్ని పాకిస్తాన్ ప్రపంచ వారసత్వ దేవాలయంగా గుర్తింపు చేయాలని ప్రయత్నం చేసింది. 2006 - 2007 ఈ మధ్యకాలంలో ఇక్కడ వున్న 6 హిందూ దేవాలయాల్లో 51.06 మిలియన్ రూపాయలను వెచ్చించి, విగ్రహాలను పునఃప్రతిష్టించారు. ఈ దేవాలయాన్ని 900 సంవత్సరాల క్రిందటే నిర్మించడం జరిగింది.

శివుడి కన్నీటిబొట్టు ఈ దేవాలయంగా ఉద్భవించింది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం స్థల పురాణం విషయానికి వస్తే, దక్షుడు చిన్నకూతురు సతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకుంటుంది. అది దక్షుడికి ఇష్టం లేకపోవడంతో వీరిద్దరికీ దూరంగా ఉంటాడు. ఇక దక్షుడు మహాయజ్ఞం తలపెట్టినప్పుడు మహా శివుడి దంపతులను ఆహ్వానించకుండానే , సతీదేవి ఈ మహా యజ్ఞానికి హాజరవుతుంది. ఇక నిండు సభలో తన కూతురు సతీదేవిని దక్షుడు అవమానిస్తాడు. ఇక ఈ అవమానాన్ని భరించలేక ఆమె అక్కడే అగ్నికి ఆహుతి అవుతుంది. అలా సతీదేవి మరణించిందనే వార్త తెలిసిన పరమశివుడి కళ్ళ నుంచి రెండు కన్నీటి బొట్లు కింద రాలాయి. అక్కడ ఒక కన్నీటి బొట్టు పాకిస్థాన్లోని కటాస్ మందిరంగా ఉద్భవించింది. మరొకటి భారతదేశంలో ఉన్న రాజస్థాన్లో ఒక దేవాలయం ఉద్భవించింది అని పురాణాలు చెబుతున్నాయి.
ఇక మొదట ఈ ఆలయం వెలుగులోకి రాకముందు, ఒక యూనివర్సిటీ లాగా పరిగణలో ఉండగా, కాలక్రమేణా ఈ క్షేత్రం శివాలయ క్షేత్రంగా వెలసింది. భారతదేశం నుండి పాకిస్థాన్ విభజన తరువాత ఇక్కడున్న భక్తులు భారతదేశానికి రాగా , ప్రస్తుతం పాకిస్థాన్ పర్యవేక్షణలో ఉండి అక్కడ పూజలను అందుకుంటున్నారు పరమ శివుడు.