
అయితే ఈ 24 గంటల వ్యవధిలో పాకిస్తాన్ ఇంకా ఇండియాలో భయంకరమైన పరిస్థితులు తలెత్తాయి. ప్రత్యేకించి భారతీయులు తమ మాన, ధన, ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఆగస్టు 14 నుండి ఆగస్టు 15వ తేదీ ఈ 24 గంటల్లోపు10 లక్షల మంది భారతీయుల ప్రాణాలు పోయాయి. కోటి 20 లక్షల మంది భారతీయులు శరణార్థులయ్యారు. పాకిస్తాన్ తన స్వాతంత్రాన్ని తన తీసుకుని దర్జాగానే వెళ్ళిపోయింది.
కానీ పాకిస్తాన్ లో ఉన్న భారతీయులు ఇక్కడికి రావడానికి మాత్రం తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ కు ఇక్కడి నుండి వెళ్ళిన వాళ్ళు ఒక 5లక్షల మంది ఉంటారు. కానీ పాకిస్తాన్ నుండి ఇక్కడికి వచ్చిన కోటి 20 లక్షల మంది ప్రజలు మాత్రం తమ ఆస్తులను, ప్రాణాలను, మానాలను కోల్పోవడం జరిగింది ఆ భయంకర సందర్భంలో. అయితే ఇంత హింస చెలరేగిన ఆగస్టు 14వ తేదీని గత ఏడాది ప్రధాని మోడీ, అమిత్ షా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ హింసకు వ్యతిరేకమైన దినంగా ప్రకటించారు.
ఆనాడు అన్నీ కోల్పోయిన వారికోసం సంఘీభావాన్ని కూడా పాటించారు. కానీ ఈసారి అయితే అమిత్ షా దీని గురించి సోషల్ మీడియాలో ఒక్క పోస్టు చేయడం తప్ప ఇంక ఏ కార్యక్రమం జరపలేదు. ఈ ప్రత్యేక దినం పేరుతో మైనార్టీలను విభజిస్తున్నారని ఓవైసీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా అనడంతో దీనిని ఆపేశారని తెలుస్తుంది.