పుట్టిన నవజాతి పిల్లలకు ఆరు నెలలు వచ్చాక తల్లిపాలతో సహా ఘన పదార్దాలను అందిస్తేనే వారికి తగినన్ని పోషకాలు లభిస్తాయి. ఘన పదార్దాలలో ముఖ్యంగా తాజా పండ్లను ఎంపిక చేసుకోవడం తెలివైన ఆలోచన. ఐతే పిల్లలకు జామపండు తినిపించవచ్చో లేదో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.




జామపండులో ఉండే విత్తనాలు పిల్లలకు తినిపిస్తే అవి అరగక వారికి బాగా కడుపునొప్పి వస్తుందనే అపోహ ఎప్పటినుండో ఉన్నదే. కానీ కొన్ని పద్దతులను పాటిస్తే ఏ జామపండునైనా మీ పిల్లలకు అరుగుతుంది. జామపండులో అన్ని పండ్లలో కంటే అధికస్థాయిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బాడీ లోని కనెక్ట్ వ్ కణజాలాలన్ని దృఢపరచడంలో కూడా విటమిన్ సి కీలక పాత్ర వహిస్తుంది. అలానే విటమిన్ సి లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే విటమిన్ సి లో అనేకమైన పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ఐతే విటమిన్ సి ని మన శరీరం తనంతట తానే తయారు చేసుకోలేదు. సో, నవజాతి పిల్లలుకు విటమిన్ సి మీరు ప్రత్యేకంగా అదింస్తే తప్ప వారు విటమిన్ సి లోపం రాదు.




జామపండు లోని విటమిన్ సి పిల్లల యొక్క మెదడు, వెన్నుముక పుట్టుక లోపాలను సులభంగా నివారించడంలో సాయం చేస్తుంది. నాడి తో సహా ప్రసరణ వ్యవస్థ ని వృద్ధి పరచడంలో జామపండు లోని విటమిన్లు తోడ్పడతాయి. జామపండులో విటమిన్ ఎ కూడా పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఎ పిల్లల కంటిచూపు ని మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జామపండులో లభించే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి రోగాలను పిల్లల చెంతకు చేరనివ్వవు. అలాగే జామపండు విత్తనాలలో లభించే లినోలెయిక్, ఫినోలిక్ వంటి కొవ్వు ఆమ్లాలు పసిబిడ్డల యొక్క మెదడు లోని కణజాల వ్యవస్థ ని అభివృద్ధి చేస్తాయి.




ఇకపోతే, జామకాయని లేకపోతే జామపండుని వేడి నీటిలో కాసేపు నానపెట్టి పొట్టు తీసి గుజ్జులాగా చేసి పసిబిడ్డలకు చెంచా ద్వారా పట్టిస్తే జీర్ణాశయ సమస్యలు ఏమి రావు. 

మరింత సమాచారం తెలుసుకోండి: