ప్రతి పల్లెటూరులో మనం సాధరణంగా చూసే చెట్లలో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టుని చాలామంది దైవంగా భావించి పూజలు కూడా చేస్తారు. అలాగే వేప చెట్టు అనేది ఓ అద్భుతమైన ఔషదం అనే చెప్పాలి. వేప చెట్టు ఆకులు, గింజలు, పువ్వులు అన్నీ కూడా మనకి ఒక ఔషదంలాగా ఉపయోగపడతాయి. అలాగే వేప ఆకులను ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తారు.అలాగే వేప ఆకులు అనేవి  యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-పారాసిటిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-ఫంగల్‌గా ఉపయోగపడుతుంది.అలాగే వేప చెట్టు వలన మనకి కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా.. ! వేప ఆకుల్లో C విటమిన్ ఉంటుంది. అది నల్ల మచ్చలు, మొటిమలు, పొడిబారే చర్మం, ముడతలు, గీతలను తొలగిస్తుంది. కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది. అందుకే వేపతో తయారయ్యే సబ్బులతో స్నానం చేసేవారు కోమలంగా, యవ్వనత్వంతో కనిపిస్తారు.


అయితే మీరు కనుక ఈ కింది విధంగా చేస్తే మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. ముందుగా  కొన్ని వేపాకుల్ని కడిగి  మిక్సీలో వేసి, పేస్టులా చేసుకుని చర్మంపై రాసుకోవాలి.ఒక 15-20 నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. కావాలంటే కొద్దిగా పెరుగు లేదా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. వేప ఆకులు జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తాయి. మీకు ఒకవేళ చుండ్రు సమస్య గాని,  జుట్టు ఎండినట్లు మారడం, చిక్కులు పడటం, దురదలు, జుట్టు రాలుట, జుట్టు సన్నగా అవ్వుట, వెంట్రుకలు చిట్లిపోవుట ఇలాంటి సమస్యలు ఉంటే వీటన్నిటికీ  వేపాకుల పొడే సమాధానం.


కొద్దిగా వేప పేస్టుకి నీరు పోసి జుట్టుకి షాంపూలా రాసుకోవాలి. వెంట్రుకల కుదుళ్ల వరకూ పేస్ట్ చేరేలా చెయ్యాలి. 2-3 గంటలు అలా వదిలెయ్యాలి. తర్వాత నీరు లేదా షాంపూతో స్నానం చెయ్యాలి.ఇలా మూడ్రోజులకు ఓసారి చేస్తూ ఉంటే రెండు మూడు వారాల్లో తేడా కనిపిస్తుంది. జుట్టు చక్కగా ఉండటానికి నీమ్ ఆయిల్ కూడా వాడొచ్చు. జుట్టు పెరగాలంటే విటమిన్ E తప్పనిసరి. అది వేపలో పుష్కలంగా ఉంటుంది. పొడవాటి జుట్టు కావాలి, త్వరగా వేగంగా పెరగాలి అనుకునేవారు మాత్రమే వేప తైలం వాడటం మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: