అయితే మీరు కనుక ఈ కింది విధంగా చేస్తే మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. ముందుగా కొన్ని వేపాకుల్ని కడిగి మిక్సీలో వేసి, పేస్టులా చేసుకుని చర్మంపై రాసుకోవాలి.ఒక 15-20 నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. కావాలంటే కొద్దిగా పెరుగు లేదా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. వేప ఆకులు జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తాయి. మీకు ఒకవేళ చుండ్రు సమస్య గాని, జుట్టు ఎండినట్లు మారడం, చిక్కులు పడటం, దురదలు, జుట్టు రాలుట, జుట్టు సన్నగా అవ్వుట, వెంట్రుకలు చిట్లిపోవుట ఇలాంటి సమస్యలు ఉంటే వీటన్నిటికీ వేపాకుల పొడే సమాధానం.
కొద్దిగా వేప పేస్టుకి నీరు పోసి జుట్టుకి షాంపూలా రాసుకోవాలి. వెంట్రుకల కుదుళ్ల వరకూ పేస్ట్ చేరేలా చెయ్యాలి. 2-3 గంటలు అలా వదిలెయ్యాలి. తర్వాత నీరు లేదా షాంపూతో స్నానం చెయ్యాలి.ఇలా మూడ్రోజులకు ఓసారి చేస్తూ ఉంటే రెండు మూడు వారాల్లో తేడా కనిపిస్తుంది. జుట్టు చక్కగా ఉండటానికి నీమ్ ఆయిల్ కూడా వాడొచ్చు. జుట్టు పెరగాలంటే విటమిన్ E తప్పనిసరి. అది వేపలో పుష్కలంగా ఉంటుంది. పొడవాటి జుట్టు కావాలి, త్వరగా వేగంగా పెరగాలి అనుకునేవారు మాత్రమే వేప తైలం వాడటం మేలు.