అంజీరాలు తాజా పండ్ల గా ఉన్నప్పటికన్నా, డ్రై ఫ్రూట్స్‌గా ఉన్నప్పుడు ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయని పోషకాహార నిపుణులు తెలియచేస్తున్నారు. అందుకే దీన్ని డ్రై ఫ్రూట్గానే తినాలని సూచిస్తున్నారు. వీటిని స్వీట్స్ లో వాడుకోవచ్చు..కొవ్వు , స్టార్చ్ వంటి ఫ్యాట్ పదార్థాలు ఉండవు అందుకే వీటిని ఏ వయసు వారైనా వాడుకోవచ్చు..వారికి ఇష్టమైన పదార్థాల్లో నిరభ్యంతరంగా తినవచ్చు.పీచు, ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు తీసుకోవడం ఇష్టం లేని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుం అందుతుంది. శృంగారంలో పాల్గొనే వారికి ఈ పండ్లు మరింత శక్తిని ఇస్తాయి