చిరుధాన్యాలు ఆరోగ్యానికే కాకుండా స్థూలకాయులు బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతాయి. అందుకే రాగులు, సజ్జల వంటి చిరుధాన్యాలు ప్రస్తుతం చాలామంది వంటిళ్లలో దర్శనమిస్తున్నాయి.ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాల వంటి అత్యవసర పోషకాలెన్నో ఈ చిరుధాన్యాల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేగాక వీటిలో మేలురకం పిండి పదార్థాలు ఉండటంవల్ల జీర్ణక్రియ సక్రమంగా అవ్వడానికి కూడా ఈ ధాన్యాలు ఎక్కువగా ఉపయోగపడతాయి.