బాలింతలు ముఖ్యంగా తీసుకోవాల్సిన పండ్లలో సపొటాలు ఒకటి. సపోటాల్లో కెరోటిన్లు, నియాసిన్, పిండి పదార్థాలు, రైబోఫ్లేవిన్లు, శక్తి, క్యాల్షియం, థయామిన్, ఫ్రక్టోస్ వంటివి ఎక్కువగా లభిస్తాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఈ పండ్లలో పాలిఫినోలిక్ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ సుగుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి హానిచేసే సూక్ష్మక్రిములను ప్రవేశించకుండా అడ్డుపడతాయి.తాజా పండ్లలో జీవ క్రియలను మెరుగుపరచే పొటాషియం, రాగి, ఇనుము, ఫోలేట్, నియాసిన్, పాంథోయిక్ ఆమ్లాలు ఉంటాయి. ఎదిగే పిల్లలకు సపోటాలు తినిపిస్తే మంచిదంటారు. గర్భిణులు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు మితంగా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. బాలింతలు తింటే పాలు వృద్ధి చెందుతాయి.