బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు సగ్గు బియ్యాన్ని తీసుకోవచ్చా? దీన్ని డైట్లో చేర్చుకుంటే ఏమవుతుంది? ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సగ్గు బియ్యం దుంప నుంచి తయారు చేస్తారు.కాబట్టి ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్యాట్ తక్కువగానే ఉంటుంది. బరువు తగ్గాలని భావించేవారు వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.