పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. అందుకే అంటారు రోజు పిల్లలకు పాలు తాపించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని..అయితే ఆవు పాలు తొందరగా జీర్ణం కావు అందుకే గేదె పాలను తాపిస్తారు.ఇంకొందరికి జీర్ణమైనా రకరకాల ఎలర్జీ సమస్యలు వస్తుంటాయి. బర్రె పాలు, బాదం పాల విషయంలో చాలా మంది పిల్లలకు ఇలా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలకు ఏ పాలు తాగించాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికోసం రైస్ మిల్క్ చాలా మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు.