ఇడ్లీలు తినడానికి అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే లైట్ ఫుడ్.. అలాగే ఆరోగ్యం కూడా.. అందుకే అంటారు ఇడ్లీ తినే వాళ్ళు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా సన్నగా ఉంటారు. ఇకపోతే బియ్యం, లేదా రవ్వతో చేసుకొనే ఇడ్లీలు కాకుండా తియ్యని ఇడ్లీలు కూడా చేసుకోవచ్చునట.. వింటుంటేనే వెరైటీ గా ఉంది కదూ.. బాబాయ్ ఇడ్లీ, కాంజీవరం ఇడ్లీ, స్పెషల్ ఇడ్లీ, మసాలా ఇడ్లీ, వెజిటబుల్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, పనసపండు ఇడ్లీ ఇవి మాత్రమే కాదు. మన రోజూ రెగ్యులర్‌గా తీసుకునే ఇడ్లీలతో పాటు అనేక రకాలుగా ఇడ్లీని వండి వడ్డిస్తుంటారు చెఫ్‌లు.ఇకపోతే కేరళ, తమిళనాడులో వెరైటీ ఇడ్లీలు, స్వీట్ ఇడ్లీలు వంటివి చేస్తుంటారు