ప్రతి వంటకు టమోటా ఎంత అవసరమో.. ఆరోగ్యానికి కూడా అంతే అవసరం... టమోటా లో శరీరానికి కావలసిన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయట. రైస్, కూరల్లో కాకుండా సూప్ చేసుకొని తీసుకోవడం వల్ల మంచిదని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు టమోట సూప్ స్టైల్ గా మారింది. ఎవరు పెట్టినా ఈ సూప్ ను చేసుకుంటున్నారు.టమాటా సూప్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్స్ ఏ, సి, కె, కాపర్, సెలెనియం ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉండే టమోటోను మన ఆహారంలో చేర్చుకుని...ఉప్పును తగ్గిస్తే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.