అలసందలు.. ధాన్యాలలో ఒకటి. వీటిలో తక్కువ క్యాలరీలు,తక్కువ కొవ్వు ఉన్న కారణంగా డైట్ లో ఉన్న వాళ్ళు వీటిని తీసుకోవడం మంచిది. అధిక బరువుతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు కరిగిపోతుంది.అలసందల్లో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందుకే బరువు తగ్గించడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది. వీటిని తినడం వల్ల మీకు పొట్టనిండిన అనుభూతి కలుగుతుంది. అదనపు ఆహారం జోలికి వెళ్లరు.. షుగర్ వ్యాది తో బాధపడేవారు లో-గ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం.