పెరుగు లో ఎన్నో పోషకాలు దాగివున్నాయి. వేడిని తగ్గించడం లో ఈ పెరుగు చక్కని ఔషధం అని చెప్పాలి. అందుకే ప్రతి రోజూ రెండు స్పూన్ల పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎటు వంటి డోకా ఉండదని నిపుణులు అంటున్నారు. అయితే పెరుగుతో పులుసు లేదా చారు చేసుకుంటారు. లేదు అంటే మసాలా రైస్ , కూరలలో వాడుతారు. అయితే ఇప్పుడు వంకాయ కూర కూడా పెరుగు వేసి చేసుకోవచ్చు అని అంటున్నారు. చాలా రుచిగా కూడా ఉంటుందట..