మొక్క జొన్న పిండితో ఆహారం మాత్రమే ఆరోగ్యం కూడా ఉంది. అంతేకాదు అందాన్ని కూడా మెరుగు పరుచుకోవానికి ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అదేలానో ఇప్పుడు చూద్దాం..మృతకణాలు పేరుకుపోయి, చర్మం బరకగా మారుతుంది. ఇలా ఉంటే దాని మెరుపు తగ్గుతుంది. దీనికి పరిష్కారంగా మొక్కజొన్న స్క్రబ్ని వాడండి. కప్పు మొక్కజొన్న పిండిలో, చెంచా సీసాల్ట్, రెండు చెంచాల కోకోపౌడర్, పావుకప్పు పాలు తీసుకుని పేస్టులా చేసుకోవాలి. దీన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకుంటే చాలు. చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది..