జంక్ ఫుడ్ అతిగా తినేవారి పై ఓ సంస్థ అధ్యయనం జరిపింది. అడిలైడ్‌లోని రాబిన్సన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు మహిళల పై జంక్ ఫుడ్ ప్రభావాల పై అధ్యయనం చేశారు. మహిళలు ఫాస్ట్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, లేకపోతే భవిష్యత్తులో సంతాన సమస్యలు వస్తాయని సంస్థ పేర్కొంది.యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఐర్లాండ్ దేశాల్లో సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న సుమారు 5 వేల మందికి పైగా మహిళల పై ఈ పరిశోధన నిర్వహించారు.