వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పనస పండు ఒకటి. భారీ పరిమాణంతో ఉండే పండు చూడ్డానికి వింతగా కనిపించినా.. అందులోని పనస తొనలు నోరూరిస్తాయి. ఈ తొనలు కేవలం రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అందుకే పనసపండును ఆయుర్వేదంలో ఔషధ గని అని పిలుస్తారు. అన్ని ఔషధ గుణాలు కలిగిన పనస పండును తినడం వల్ల మనిషి ఆయుష్ పెరుగుతుందని అంటున్నారు..పనసలో ఫైబర్, విటమిన్- సి, విటమిన్- ఎ, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, భాస్వరం, కాల్షియం కూడా ఉంటాయి. ఇది బీటా కెరోటిన్, లుటిన్, మరియు జియాక్సంతిన్లతో సహా గణనీయమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంది.