పండ్లు యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.ఇక రెండోవది బీన్స్.. ఈ బీన్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రకరకాల రూపాల్లో లభించే బీన్స్ తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గించుకోవచ్చు. కొవ్వు పదార్థాలను కరిగించుకోవచ్చు .అవకాడోలో గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.