వేసవి అంటే కొత్త రుచులు రావడం తో పాటుగా మనుషులకి కొత్త ఆరోగ్య సమస్యలను కూడా తీసుకొస్తుంది. ఈ మేరకు బయటకు వెళ్ళాలన్న కూడా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం 10 దాటితే చాలు దాహం వల్ల ఏమి తినాలో తెలియక వెళ్లిన దారిలోనే మళ్లీ ఇంటికి వస్తున్నారు. వేడి ఒకవైపు, మరో వైపు చెమట కాయలతో భాధ పడుతున్నారు. అయితే, ఇప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొంతవరకు వేడి నుంచి బయట పడవచ్చు నని నిపుణులు అంటున్నారు. సబ్జా, వాల్ నట్స్ తదితర ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదట..