ఆదివారం వస్తే చాలా మందికి గుర్తొచ్చేది కోడి కూర. ఇప్పటికీ పల్లెటూళ్లలో పెంచుకున్న కోళ్లనే కోసుకుని తింటుంటారు. ఇది చాలా సాధారణం.. కానీ.. తెలంగాణలోని ఓ పల్లెలో మాత్రం అసలు కోడి కూతే వినిపించదట. ఆ గ్రామం వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం కంచిరావుపల్లి తండా. మొత్తం 550 జనాభా ఉండే ఈ పల్లెటూళ్లో కోడి అన్న జంతువే కనిపించదు.


ఇప్పుడే కాదు.. కొన్ని తరాల నుంచి ఇక్కడి వారు కోడిని చూడలేదట. ఎప్పుడైనా వేరే గ్రామం వెళ్లినప్పుడు చూడటమే తప్ప.. ఈ గ్రామంలో కోడి అన్నమాటే వినిపించదట. కోడి అనేదే లేనప్పుడు ఇక చికెన్ తినడం, కోడిగుడ్లు తినడం అన్నవి ఆ గ్రామంలో లేవు.


కొన్ని తరాలకు పూర్వం సోమనాథ్ బావుజీ అనే గురువు ఈ గ్రామానికి వచ్చినప్పుడు.. ఆయన వేసిన ఉమ్మిని ఓకోడి తిన్నదట. అప్పుడాయన ఇక్కడి ప్రజలు కోడి మాంసం, గుడ్లు.. కోడికి సంబంధించినవేవీ తినకూడదని ఆజ్ఞాపించారట. అప్పటి నుంచి ఈ గ్రామంలో అదే ఆచారం కొనసాగుతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: