అతను ఒక అమర జవాన్ మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. అతని పేరు మూల్ చంద్. తన భార్య నిండు చూలాలిగా ఉన్నప్పుడు ఉద్యోగమే కర్తవ్యంగా భావించి దండకారణ్యానికి వెళ్ళాడు అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో మూల్ చంద్ ప్రాణాలు విడిచారు. అప్పటికీ తన భార్య నిండు చూలాలు.
మూల్ చంద్ మరణించిన తరువాత అమరుడైన మూల్ చంద్ కి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి తన భార్య తో పాటుగా చిట్టి తల్లి హాజరయింది. ఈ ఘటన గడిచి చాలా రోజులు అయింది ఇక మూల్ చంద్ పుట్టినరోజు రోజు కావడంతో తన కూతురు ముద్దు ముద్దు మాటలు పలుకుతూ "నాన్న ఐ లవ్ యూ, ఈ మిఠాయి తిను నాన్న" అని తన తండ్రి శిలావిగ్రహానికి మిఠాయి తినిపించడం అందరిని కంటతడి పెట్టించింది. ఈ హృదయవిదారక ఘటనను చుసిన వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు.
ఆ చిట్టి తల్లికి తన నాన్న ఇంకా బ్రతికి ఉన్నడెమో అనుకుని మిఠాయి తినిపించింది. మూల్ చంద్ ఒక్కరే కాదు ఛత్తీస్గడ్ రాష్ట్రంలో జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో చాలా మంది జవాన్లు అమరులయ్యారు. తమ కుటుంబాలని సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వారి సేవలకు గుర్తుగా ప్రభుత్వాలు వారి స్మారక విగ్రహాలు ఏర్పాటు చేసి వారు బౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి ధైర్య సాహసాలతో ఎప్పుడూ మన మధ్య ఉంటారని నమ్ముతున్నారు.
ఇలా మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో ప్రాణాలు విడిచిన జవాన్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వారికి సాయం చేయాలని కుటుంబ సభ్యుల తరపున ప్రజా సంఘాలు, జవాన్ల కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈరోజు జరిగిన ఈ కన్నీటి దృశ్యం మరెప్పుడూ పునరావృతం కాకుండా అసాంఘిక శక్తులని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి