నిమిషం కూడా ఖాళీ ఉండని జీవితాలు మనవి. ఉదయం లేచిన దగ్గర నుంచి అన్నింటికీ ఉరుకులు పరుగులే. మనకు సాంత్వన ఇవ్వాలని టెక్నాలజీ మన జీవితాలను ఇంకాస్త సంక్లిష్టం చేస్తోంది. పాఠశాలకు వెళ్లే పసివాడి దగ్గర నుంచి రిటైర్ కాబోతున్న ఉద్యోగి వరకూ అందరూ బిజీబిజీనే.

 

అయితే ఈ ఉరుకుల పరుగుల మధ్యలోనే మనకు మనం సమీక్షించుకోవాల్సి ఉంటుంది. అసలు మీరు ఏంటి..మీ లక్ష్యం ఏమిటి.. ఇప్పుడు సరైన పంథాలోనే వెళ్తున్నారా.. మీకు నచ్చినట్టే ఉంటున్నారు. మీకు నచ్చిన పనులు చేయగలుగుతున్నారా.. మీకంటూ మీరు సమయం వెచ్చించగలుగుతున్నారా..

 

ఈ ప్రశ్నలను ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత బిజీ లైఫ్ లో నైనా మనకంటూ మనం సమయం కేటాయించుకోలేకపోతే.. ఈ ఉరుకులు, పరుగులు ఆపిన తరవాత వెనక్కితిరిగి చూసుకుంటే మీకంటూ మిగిలిందేమీ ఉండదు. అప్పటికే పరిస్థితి చేజారిపోతుంది.

 

అప్పుడు చింతించడం మినహా చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. అందుకే ఎంత బిజీ అయినా సరే.. మీకంటూ కొంత సమయం అయినా కేటాయించుకోండి. మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: