1. ఆకలిగొన్నవాడికి   ' దేవుడు '  కనపడేది అన్నం రూపంలోనే ! 
   
   ( మహాత్మా గాంధీ

 

2. " నేను వంటింట్లోకి వేరే  పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని ! 
ఎంతయినా అమ్మ అంటే అన్నం.  అన్నం అంటే అమ్మ ! అంతే !

  ( జంధ్యాలగారు ) 

 

3. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం ! 

( విశ్వనాధ సత్యనారాయణ గారు )

 

4.. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !  వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో  మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! 

( రేలంగి వెంకట్రామయ్య గారు ) 


 
5. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా,   మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !

( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) 

 

6. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు 

" అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు. 
అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ 
అర్ధం కాలేదు ! 

( ఆత్రేయ గారు ) 

 

7. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం ! 
అమ్మ చేతి   అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! 

( చాగంటి కోటే శ్వర రావుగారు )

 

8.  ఆకలితో వున్న వాని  మాటలకు ఆగ్రహించవద్దు !!

( గౌతమ బుద్దుడు )

 

9 ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది !
( మాతా అమృతానందమయి ) 

 

10. మీ పిల్లలు ఎంతదూరంలో,  ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు 


మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించు.

మరింత సమాచారం తెలుసుకోండి: