ప్రపంచంలో ఎంత గొప్పవారికైనా పాపంటే చచ్చేంత భయం.  కొన్ని కాలసర్పాలు దూరం నుంచే తమ విష ప్రభావాన్ని చూపిస్తుంటాయి.  సాధారణంగా ఎంతటి విష సర్పమైనా వాటిని మాత్రం దేవుడు, దేవతలా పూజిస్తుంటారు.  ప్రపంచంలో పాములంటే భయం ఉంది.. అంతకన్నా ఎక్కువ భక్తీ ఉంది.  చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టు అనే సామెత ఉంది.  అంతే చిన్న పాములో సైతం మనిషిని క్షణాల్లో చంపే విషం ఉంటుంది.  సాధారణంగా పాములు అంటే కొన్ని ముంగీసా, గ్రద్ద లాంటి వాటికి తప్ప ఇతర జంతువులకు భయమే.  నాగు పాములు, బ్లాక్ కోబ్రాలు అటవీ ప్రాంతాల్లో భయంకరమైన విష సర్పాలు ఉంటాయి.  అలాంటి వాటితో ఎంతటి కృరమృగానికైనా విషప్రభావంతో మరణిస్తుంటాయి. 

 

 

తాజాగా ఓ పాము తమ ముందు ఉందనుకోని ఒరాంగుటాన్లు ఎంతగా భయపడిపో యాయో చూస్తే అందరికీ నవ్వు వస్తుంది. ఓ ఫారెస్ట్ లో ఒరంగుటాన్ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఉంది. ఇంత‌లోనే వారి దగ్గ‌ర‌కు పాము వ‌చ్చింది. త‌ల్లి ఒరంగుటాన్ ఒక‌వేళ పాము క‌నిపిస్తే ఎలా భ‌య‌ప‌డాలో, ఎలా జాగ్ర‌త్త ప‌డాలో యాక్టింగ్ చేసి మరీ త‌న పిల్ల‌ల‌కు చెప్తోంది. ఇక్కడ చిన్న చిన్న ఒరంగుటాన్ పిల్లలు చేస్తున్న ఫన్నీ.. భయపడే తీరు చూస్తుంటే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది. 

 

 

అయితే అది రబ్బరు పాము.. ఒక వేళ తాము ముందు పాము ప్రత్యక్షం అయితే ఎలా తప్పించుకోవాలి అన్న విషయం పై అవగాహన తెచ్చేందుకు జూ పార్కు సిబ్బంది ఇలా రబ్బరు పాము తో ప్రాక్టీస్ చేయించారు.  ఇక్కడ తల్లి ఒరాంగుటాన్ పిల్లలకు ఎలా జాగ్రత్తగా ఉండాలో అన్న విషయం చెబుతుంది.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: