ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్సాంతి. రెండోది సంతృప్తి. ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు .

 

 

 

ఒకటి గుర్తు పెట్టుకోండి. ప్రపంచంలో ఎన్ని వింత జబ్బులు వచ్చి ప్రాణాలు తీస్తున్నా వాటికి ఏదో ఒక రోజు మందుని తయారుచేసి ప్రాణాలు కాపాడవచ్చు.. కానీ.. ! ఎదుటి వాడిని ముంచి పైకి ఎదగాలి అనే జబ్బుకు ఎన్ని యుగాలైనా మందు లేదు .

 

 

మనశ్శాంతికి మూలం.. జ్ఞానం.. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవాలి. నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకోవాలి . ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకోవాలి. చావు బతుకులు ఎక్కడో లేవు.. ధైర్యం లోనే బతుకు ఉంది.. భయం లోనే చావు ఉంది. ఏదైనా సరే అది నీదని రాసిపెట్టి ఉంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఆఖరికి అది నీ వద్దకే చేరుకుంటుంది.

 

 

జీవితంలో సంతృప్తి అనేది చాలా పెద్ద సంపద. ఎంత సంపాదించినా ఈ సంపద లేకపోతే తృప్తి ఉండదు. అందుకే ఇది లేని వారు.. తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదిస్తుంటారు. అలాంటి వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోలేరు .

 

మరింత సమాచారం తెలుసుకోండి: