వెలగపండు.. అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి.. ఈ పండు అంటే వినాయకుడికి బాగా ఇష్టం.. అంతేకాదు మనం కూడా ఈ పండును ఇష్టంగా తింటాము. ఎందుకంటే ఈ పండు రుచి అటువంటిది. పుల్లగా , తియ్యగా , వగరుగా ఉండే ఈ కాయలను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు వదలరు. అయితే ఈ వెలగ పండు తో చేసే కొన్ని రుచికరమైన వంటలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


వెలగ పండు పచ్చడి

కావలసినవి: 

వెలగపండు- 1; బెల్లం పొడి - ఒక కప్పు; కారం- ఒక టేబుల్‌ స్పూను; ధనియాల పొడి - ఒక టేబుల్‌ స్పూను; వేయించిన జీలకర్ర పొడి - ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు - తగినంత; కొత్తిమీర - 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానం: 

ముందుగా వెలగపండును పగులగొట్టి గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి. మిక్సీలో అన్ని పదార్థాలు వేసి మెత్తగా చేయాలి. ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో ఉంచితే పదిరోజుల వరకు బాగుంటుంది..ఇకపోతే ఈ వంటను గాలి చొరబడని పాత్రలో వేస్తే ఇంకొన్ని రోజులు ఉంటుంది.


వెలగ పండు షర్బత్‌

కావలసినవి:

వెలగ పండు -1; నీళ్లు - తగినన్ని; పంచదార - తగినంత

తయారీ విధానం :


ముందుగా వెలగపండు గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙చేతితో మెత్తగా మెదిపి, తగిన న్ని నీళ్లు జత చేసి, చేతితో బాగా కలపాలి. ఒక పాత్రలోకి వడ పోయాలి. తగినంత పంచదార జత చేసి బాగా కలియబెట్టాలి. ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి, బయటకు తీసి చల్లగా తాగాలి . ఎండ బాధ నుంచి కాపాడుతుంది..


ఇవే కాకుండా చాలా రకాల వంటలను చేసుకోవచ్చు.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. అల్సర్‌తో బాధపడే వారికి ఈ పండు వల్ల ఉపశమనం కలుగుతుంది. వెలగపండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధి అవుతుంది. కిడ్నీలో రాళ్లు, రక్త హీనత, స్త్రీలకు వచ్చే సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే సర్వ రోగ నివారిణి అని చెప్పవచ్చు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: