బంగాళదుంపను కూరగాయల లో రారాజుగా పిలుస్తూ ఉంటారు. ఏదైనా సరే కూరగాయలతో కలిపి వీటిని వండుకోవచ్చు పలు రకాల కూరలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మార్కెట్ నుంచి మనం తీసుకువచ్చిన కూడా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండే కూరగాయల లో ఇది కూడా ఒకటి. ఇది ఏ కాలంలో నైనా సరే దొరుకుతుంది కాబట్టి మన భారతీయ ఇళ్ళలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ మంది వీటిని తినడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. వీటి ద్వారా పలు రకాల చిప్స్ చేసుకొని తింటూ ఉంటారు. అయితే బంగాళ దుంపను ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు తెలియ జేస్తున్నారు వాటి గురించి తెలుసుకుందాం.

మనం మితిమీరి ఏ ఆహార పదార్థాలు తిన్నా.. అది మనకు హానికరంగా మారవచ్చు. అయితే మనం బంగాళదుంపను ఎక్కువగా తీసుకుంటే పలు జాగ్రత్తలను పాటిస్తూ ఉండాలి. ఎందుచేత అంటే దీనివల్ల మనకు అలర్జీ సమస్యలు కూడా రావచ్చు.

ముఖ్యంగా బంగాళదుంప లో ఉండే కార్బోహైడ్రేట్లు, కీళ్ల నొప్పులను మరింత పెంచడానికి అవకాశం ఉంటుంది. అందుచేతనే కీళ్ళ నొప్పులతో బాధపడే రోగులు ఈ బంగాళదుంపలను తినకపోవడం మంచిది.

మధుమేహంతో బాధపడే వారు బంగాళదుంపను అసలు తినకూడదు.  ఎందుచేత అంటే బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలి అంటే కచ్చితంగా బంగాళదుంప కు దూరంగా ఉండాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి విలువలు పెరిగి.. మధుమేహం మరింత పెరిగేలా చేస్తాయి.

బంగాళాదుంపను ఎక్కువగా తింటే రక్త పోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే బిపి రోగులు ఎవరైనా సరే బంగాళదుంపను తక్కువగా తినడం మంచిది.

బంగాళదుంపలలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల ఇవి కేలరీలను పెంపొందిస్తాయి. ఇక అంతే కాకుండా ఇది ఊబకాయానికి కూడా దారితీస్తుంది. సన్న బడాలనుకుంటున్న  వారు ఈ బంగాళ దుంపను తక్కువ తినడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: