జీవితంలో మతిమరుపు అనేది కొంతమందికి శాపంగా మారితే మరి కొంతమందికి వరంగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. కొంతమంది తమ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను మతి మరుపు అనే పదంతో మరిచిపోతే వారు ముందు జీవితంలో చాలా సంతోషంగా జీవిస్తారు. కానీ ఇలాంటి కొన్ని కొన్ని వాటికి మతిమరుపు అనేది మంచిదే అయినా నిజంగా మతిమరుపు అనేది ఒక పెద్ద వ్యాధి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మతిమరుపు అనేది మానసిక ఆరోగ్యానికి సంబంధించినది. ఇకపోతే తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మన మెదడుపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.


మనం తీసుకునే ఆహారం మన మెదడు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి తప్ప మెదడుపై చెడు ప్రభావాన్ని చూపించకూడదు ముఖ్యంగా టమాటోలను జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కావలసిన పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టమోటాలలో ఉండే పోషకాల విషయానికి వస్తే విటమిన్ సి, విటమిన్ ఏ తో పాటు రాగి , పొటాషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇక మెదడు యొక్క కణజాల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది టమోటా అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే మరికొన్ని ఆహారకదార్థాలు ఏమిటో ఇప్పుడు చదివి తెలుస్తుంది.


అందులో ఒకటి కొవ్వు చేప.. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో మన మెదడు రూపొందించబడి ఉంటుంది కాబట్టి మన మెదడుకి అవసరమైన ఒమేగా 3 ఆమ్లాలు మనకు చేపల ద్వారా లభిస్తాయి. వీటిని తింటే మన జ్ఞాపకశక్తి మెరుగుపడడమే కాకుండా మతిమరుపు సమస్య కూడా దూరం అవుతుంది. అలాగే కాఫీలో ఉండే కెఫిన్ కూడా మీ మతిమరుపును దూరం చేస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి మెరుగుపడ్డమే కాకుండా ఏకాగ్రత కూడా పెంచుతుంది అని కాబట్టి వారానికి రెండుసార్లు కాఫీ తాగితే కెఫిన్ తో పాటు యాంటీ -ఆక్సిడెంట్ లు కూడా మీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయని సమాచారం. అలాగే పసుపు,  బ్రోకలీ కూడా మీ మెదడు ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాగే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: