అధిక బరువు సమస్యతో ఎక్కువగా బాధపడే వారు అన్నింటి కంటే ముందు ఏ ఆహారాన్ని తీసుకోవాలి.. ఏ ఆహారాన్ని తీసుకోకూడదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారాలు శక్తిని ఇవ్వడంతో పాటు బరువు తగ్గేలా కూడా ఉండాలి. ఇంకా అలాగే అవి రుచిగా ఉండేలా కూడా చూసుకోవాలి. రుచి కోసం నిమ్మకాయ, తేనె, ఖర్జూర పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోండి. నూనెలో వేయించిన పదార్థాలను మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే కొన్ని రకాల ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా బరువు పెరిగే అవకాశాలు  ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి మన బరువు తగ్గే ప్రయత్నాన్ని కూడా ఆపేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఎటువంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.బరువు తగ్గాలనుకునే వారు అన్నాన్ని ఇంకా అలాగే బంగాళాదుంపలను కలిపి అస్సలు తీసుకోకూడదు.ఎందుకంటే అన్నం సులభంగా జీర్ణమైనప్పటికి దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా బంగాళాదుంపలో కూడా కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అధిక క్యాలరీలు లభించి బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.


అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఈ రెండింటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. అలాగే చాలా మంది ఎక్కువగా సాండ్ విచ్ రూపంలో వైట్ బ్రెడ్ ను, యోగర్ట్ ను కలిపి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ రెండింటిని కలిపి అస్సలు తీసుకోకూడదు.ఎందుకంటే ఈ వైట్ బ్రెడ్ అనేది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.ఎందుకంటే దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా చాలా ఈజీగా పెరుగుతాయి. వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ లేదా చిరు ధాన్యాలతో చేసిన బ్రెడ్ ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే యోగర్ట్ లో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దీనిని తీసుకోవడం వల్ల అధిక క్యాలరీలు లభించి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదే విధంగా ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారాలను ఒకేసారి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొంతమంది చికెన్ తో పాటు పప్పు కూడా తింటూ ఉంటారు.ఇక వీటిని కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో పాటు బరువు పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: