ఇప్పుడిప్పుడే కాశ్మీర్ లో పరిస్థితులు సద్దుమణిగి ప్రజలు శాంతి యువత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్ లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ నేతలు చిచ్చు రేపేలా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే చాలా మంది మేధావులు అవుననే అంటున్నారు. లౌకిక వాద ముసుగులో మిలాద్ ఉన్ నబీ వేడుకలో టిప్పు సుల్తాన్, ఔరంగజేబు లాంటి వారి విగ్రహాల ఆవిష్కరణతో పాటు హిందువులను చంపేందుకు వాడిన రంపపు ఆయుధాలను ప్రదర్శనలో ఉంచారు.
ఒకనాడు హిందువులను ఊచకోత కోసిన వ్యక్తుల గురించి వారు వాడిన ఆయుధాలను చూపెడుతూ ప్రదర్శన చేస్తే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది తప్పా ఎక్కడా కూడా అడ్డుకున్నా దాఖలాలు చేయలేదు. దేశంలో స్వాతంత్య్రం తెచ్చేందుకు పని చేసిన ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన సమయంలో దేశంలో మత చిచ్చు రేపి కొంతమందిని చంపిన వారిని ఊరేగింపు నిర్వహించడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏం చేయాలని భావిస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు.
లౌకిక వాద ముసుగులో కొంతమందికి విచ్చలవిడిగా తిరగడానికి అవకాశం ఇచ్చి మరికొందరికి మాాత్రం ఆంక్షలు పెడుతున్నారు. ఎక్కడ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడిన కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. కాబట్టి దేశంలో శాంతి యుత వాతావరణం నెలకొల్పేలా జాగ్రత్తలు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వం తీసుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి