లక్షణమైన కుర్రాడు తారసపడితే కూతురున్న ఏ తండ్రికి అయినా అల్లుడిని చేసుకోవాలి అనిపిస్తోంది. కాకపోతే దానికి ఓ పద్ధతి ఉంటుంది. నచ్చాడు కదా అని బెదిరించో.. బాదేసో పెళ్లి చేయరు కదా ! కానీ బిహార్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి తలపై తుపాకీ పెట్టి బెదిరించి తన కూతురుతో వివాహం జరిపించాడో తండ్రి. వైశాలి జిల్లాలో జరిగిన ఈ వింత పెళ్లి గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.


గౌతమ్ కుమార్ అనే యువకుడు ఇటీవలే బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పరీక్షలో పాసయ్యాడు. పటేపూర్ రేపురాలోని ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. అతను పాఠాలు చెబుతుండగా నలుగురైదుగురు వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్లారు. తుపాకీతో బెదిరించి కిడ్నాపర్లలో ఒకరి కూతురుతో బలవంతంగా వివాహం జరపించారు. పెళ్లి చేసుకోనని చెబితే అతనిపై దాడి కూడా చేశారు.


సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రాజేశ్ రాయ్ అనే వ్యక్తి తమ కుమారుడిని కిడ్నాప్ చేశారని వారు ఆరోపించారు. గతంలో తన కుమార్తె చాందినిని వివాహం చేసుకోవాల్సిందిగా రాజేశ్ ని కోరారని..దానికి తిరస్కరించినందుకే  అతడిపై భౌతిక దాడి చేశారని పోలీసులకు వివరించారు. అయినా లొంగకపోవడంతోనే కిడ్నాప్ చేసి తన కూతురు నిచ్చి బలవంతంగా వివాహం చేసేందుకు యత్నించారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్ రాయ్ ఇంటికెళ్లి ప్రశ్నించగా తొలుత తమకు ఏమీ తెలియదని చెప్పిన ఆయన సోదాలు నిర్వహిస్తే అసలు విషయం బయట పడింది.


అయితే ఈ వివాహానాకి పకడ్వా అనే పేరు ఉంది. అంటే ఎత్తుకెళ్లి పెళ్లి చేయడం అనమాట. ఇప్పుడు బిహార్ లో ఈ తరహా పెళ్లిళ్లు ఎక్కువ అయ్యాయి. గతంలో అనారోగ్యానికి గురైన జంతువుకి వైద్యం చేయడానికి వచ్చిన వెటర్నరీ వైద్యుడిని కూడా ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం జరిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: