ప్రతి ఒక్క భార్య కూడా తన భర్త బాగుండాలి అని.. బాగా సంపాదించాలి అని ..బాగా హెల్దిగా ఆరోగ్యకరంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు . దానికోసం కనిపించిన ప్రతి దేవుడికి మొక్కులు మొక్కేస్తూ ఉంటారు.  చాలామంది భార్యలు ఇలానే తమ భర్త క్షేమం కోసం రకరకాల పూజలు రకరకాల మొక్కు లు..తన భర్త ఎప్పుడు హ్యాపీగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంటారు . మరి కొంతమంది తన భర్త బాగా డబ్బు సంపాదించాలి అని రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు . అయితే అలాంటి భార్యలు తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తే భర్తను సంపాదన పెరగడమే కాదు అతనికి అదృష్టం కలిసి వచ్చి మంచి ధనవంతుడు కూడా అవుతాడు అని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు .మరి ఆ నియమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..!!


*చాలామంది మహిళలు భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళగానే తలుపులు వెంటనే మూసేస్తారు . అలా వెంటనే మూసేయడం ద్వారా భర్తకు నష్టాన్ని తీసుకొస్తుందట . ఐదు నిమిషాల తర్వాత తలుపులు వేసుకుంటే మంచి జరుగుతుందట.

*అంతేకాదు కొంతమంది మహిళలు భర్తలు బయటకు వెళ్లగానే స్నానానికి వెళ్లిపోవడానికి వెళుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా భర్త బయటకు వెళ్ళినప్పుడు భార్య తల స్నానం లాంటివి చేయకూడదట . ఐదు నిమిషాలు ఆగి వెళ్ళాలి అంటూ జ్యోతిష నిపుణులు చెప్తున్నారు.

*అంతేకాదు ఉతికిన బట్టలను మడత పెట్టేటప్పుడు తలకిందులుగా అసలు ఫోల్డ్ చేయకూడదట . బట్టలను తలకిందులుగా ఫోల్డ్ చేస్తే భర్తకు అదృష్టం కలిసి రాదట .

*అంతేకాదు భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళగానే ఇల్లు ఊడ్చకూడదు తడి వస్త్రంతో అస్సలు చూడకూడదు అంటున్నారు జ్యోతిష్య పండితులు .

*శుక్రవారం పూట అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలతో పూజలు చేస్తే కచ్చితంగా భర్త సంపాదన పెరుగుతుంది అంటున్నారు పండితులు .

*కిచెన్ లో ఉండే యాలకులను ఎండిపోకుండా ఆకుపచ్చ రంగులోనే ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లవారుజామున నిద్రలేవగానే వినాయకుడి ఫోటోను చూసేలా ఫోటోలు అమర్చుకోవాలి .

*శుక్రవారం నాడు పసుపు గుడ్డలో పచ్చ కర్పూరం ఉంచి మూట కట్టి పూజ గదిలో పెట్టి దానికి ప్రతిరోజు ధూపం వేయాలి. అప్పుడు భర్త సంపాదన రెట్టింపు పెరుగుతుందట.

*ఆకుపచ్చలేదు ఎరుపు రంగు మట్టి గాజులు నిరంతరం ధరించాలి.

*భార్యలు ఈ ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల భర్తకు అదృష్టం కలిసి వస్తుంది అని అనేకమార్గాలలో ధనం సమకూర్తుంది అని కొందరు జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణుల దగ్గర నుంచి సేకరించిన సమాచారం. శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే . అంతేకానీ వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అనే విషయాలు పాఠకులు గుర్తుంచుకోవాలి . దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం...!
 
1

మరింత సమాచారం తెలుసుకోండి: