భారతదేశమంటేనే సర్వమత, కులాల సమ్మేళనం. ఇండియాలో ఉండే ప్రజలంతా హిందువులే, కానీ వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. ఇప్పటికి టెక్నాలజీలో ఎంతో దూసుకుపోయినా కానీ  సాంప్రదాయాలు పాటించడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. అయితే కొంతమంది సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న గిరిజన తండాల్లో ఉండే ప్రజలు మాత్రం వారి సంస్కృతి సాంప్రదాయాలను ఇప్పటికీ పోనివ్వడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో నివసించే చెంచు తెగలు మాత్రం ఇంకా వారి తాతలు, తండ్రులు పాటించిన సాంప్రదాయాలను పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నిజానికి ఇది చాలా ఉత్తమమైన పద్ధతి అని చెప్పవచ్చు.. టెక్నాలజీలో ఎంతో ముందుకు వెళ్లినటువంటి పట్టణ జనాలతో పోల్చుకుంటే ఈ గిరిజన చెంచు తెగలు బెటర్ గా చెప్పుకోవచ్చు. 

ఎందుకంటే వీరు పెళ్లిళ్లు చేస్తే  ఖర్చు అనేది ఉండదు.. కట్న కానుకలు అనేవి అసలే కనిపించవు. ముఖ్యంగా అబ్బాయి అమ్మాయి ఇష్టపడితే చాలు పెద్దల మధ్య మాట్లాడుకుని పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు.. కానీ కట్నంగా ఆ ఒక్కటి మాత్రం తప్పనిసరిగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. అదే సారాయి.. అబ్బాయి అమ్మాయి ఇష్టపడితే ముందుగా గూడెం పెద్దలంతా కలిసి అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి అమ్మాయి ఇంటికి ముందుగా వెళ్తారు. అయితే వెళ్లేటప్పుడు అబ్బాయి తరఫున వాళ్లు 5 సీసాల సారాయిని వారి ఎదురుగా ఉంచితే, అమ్మాయి తరఫున ఉన్నవాళ్లు మూడు సీసాల సారాను వరుడు తెచ్చిన సారాయితో కలిపేస్తారు. ఈ విధంగా రెండు కుటుంబాల కలయికను  సారాయితో కలుపుకొని వధూవరులు ఒకటవుతారు. ఇరు కుటుంబాలు తీసుకొచ్చిన సారాయిని ఒక్క దగ్గర కలిపి  వచ్చిన పెద్దలందరికీ తలా ఇంత పంచుతారు. ఇదే సమయంలో గూడెం పెద్దలు వారి పెళ్లి తేదీని నిర్ణయిస్తారు. ఇదే కాకుండా  వీరి వివాహాల్లో వరకట్నం అనేది అస్సలు కనిపించదు.. కేవలం 11 రూపాయలు మాత్రమే వరుడు కుటుంబీకులు వధువుకు ఇవ్వాల్సి వస్తుంది.

అంతేకాదు పెళ్లికి కావలసిన ఖర్చులన్నీ పెళ్ళికొడుకు తరుపు వారే భరించాలి. ముఖ్యంగా పెళ్లికూతురికి రెండు చీరలు, ఆమె తల్లికి ఒక చీర తీసుకెళ్లాలి. అంతేకాకుండా వధువు తరఫున వారు  అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు పెట్టిన పప్పన్నం మాత్రమే  వారు పెట్టే ఖర్చు. ఇక మిగతా ఖర్చు అంతా  పెళ్ళికొడుకే భరిస్తారు. ఇలా చెంచుల జాతుల్లో పెద్దగా ఖర్చు లేకుండా ప్రకృతి ఒడిలో వారి దేవతలను పూజిస్తూ  పసుపు కొమ్ము వధువు మెడలో కడతాడు.. దీంతో పెళ్లి తంతు ముగుస్తుంది. ఈ విధంగా పెళ్లిలో సారాయి ఇచ్చిపుచ్చుకోవడం ద్వారానే వివాహం జరుగుతుంది. ఈ సాంప్రదాయం వారు వందల ఏళ్ల నుంచి పాటిస్తూ వస్తున్నారట. ఒకవేళ ఈ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోకుంటే వారి పెద్దలకు కోపం వస్తుందని, మంచి జరగదని చెంచు తెగలవారు నమ్ముతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: