
శారీరక శ్రమ ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు తింటే మంచి శక్తిని పొందుతారు. ఇందులో విటమిన్ C, విటమిన్ E ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్, జలుబు, తుమ్ములు వంటి వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. చామదుంపలో పొటాషియం అధికంగా ఉండి, రక్తపోటును సమతుల్యం చేస్తుంది. దాంతోపాటు హృదయ స్పందన నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని నిగారింపుగా, మెరుస్తూ ఉంచుతాయి. విటమిన్ A, విటమిన్ E ఉండటం వల్ల చర్మంపై ముడతలు రాకుండా, యవ్వనాన్ని కాపాడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది.
తక్కువగా తిన్నా ఎక్కువ కాలం ఆకలిగా ఉండదు. ఇది అధిక బరువు ఉన్నవారికి మంచి ఆప్షన్. చామదుంపలు సహజమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇది శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు ఉండటం వల్ల ఎముకల అభివృద్ధికి, రక్త హీమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. కాని తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది. చామదుంపలో ఉండే విటమిన్లు మరియు మినరల్స్ మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి మెరుగవుతుంది. చామదుంపలు ముద్దగలిగే, కొద్దిగా తుప్పు వంటి రుచి కలిగి ఉంటాయి. దాన్ని తొలగించాలంటే ఉడకబెట్టి, కొద్దిగా నిమ్మరసం లేదా పులుపు కలిపి వండాలి.