తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ హవా ఉన్న నియోజకవర్గాల్లో కొత్తపేట కూడా ఒకటి. గత రెండు పర్యాయాలు నుంచి ఇక్కడ వైసీపీకి ఊహించని  విజయాలు దక్కుతున్నాయి. 2014 ఎన్నికల్లో చిర్ల జగ్గిరెడ్డి కేవలం 700 ఓట్ల తేడాతో టీడీపీ నేత బండారు సత్యానందరావుపై విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గాలి బాగా ఉన్న కూడా జగ్గిరెడ్డి 4 వేల తేడాతో బయటపడ్డారు.

 

అయితే జగ్గిరెడ్డి తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన 2004లో కూడా అదే టీడీపీ అభ్యర్థి బండారుపై కేవలం 2 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2009లో ఓటమి పాలవ్వగా, నెక్స్ట్ వైసీపీలోకి వచ్చి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఇప్పుడు ఎలాగో వైసీపీ అధికారంలోకి రావడంతో పీయూసీ చైర్మన్ పదవి కూడా దక్కింది. జగ్గిరెడ్డి నియోజకవర్గంలో బాగానే పనులు చేసుకోగలుగుతున్నారు. 

 

సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ప్రజా సమస్యల మీద బాగా అవగాహన ఉంది. దాంతో నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సజావుగా అందేలా చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో కొత్త సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. 

 

ఇక ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకు సాధ్యమైన మేరకు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మాస్కులు అందిస్తున్నారు. ఇంకా రైతుల సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలో 6 వేలకు పైగా మహిళలు సున్నా  వడ్డీ పథకం ద్వారా లబ్ది పొందారు. 

 

అయితే పార్టీ పరంగానే ప్రభుత్వ పథకాలు అందుతున్నట్లు తెలుస్తోంది. అపొజిషన్ పార్టీ కార్యకర్తలకు పెద్దగా లబ్ది జరగడం లేదని సమాచారం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే, నియోజకవర్గంలో రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో వైసీపీ బలంగానే కనిపిస్తోంది. టీడీపీ కూడా కొన్ని చోట్ల బాగానే పోటీ ఇచ్చే అవకాశముంది. 

 

ఇక్కడ టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యానందరావు బాగానే యాక్టివ్ గా ఉన్నారు.రెండుసార్లు వరుస ఓటమి వచ్చిన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నియోజకవర్గంలో పని చేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకుని పోతూ, అధికార పార్టీపై పోరాటం చేస్తూనే, ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు తనవంతు సాయం అందిస్తున్నారు.  అయితే ఇప్పటికే స్వల్ప మెజారిటీలతో రెండు సార్లు విజయం అందుకున్న జగ్గిరెడ్డికి నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: