కర్నూలు జిల్లా...ఆళ్లగడ్డ నియోజకవర్గం..భూమా ఫ్యామిలీ అడ్డా... ఆ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉన్న విజయం వారి వైపే ఉండేది. ఆళ్లగడ్డ నుంచి 1989లో భూమా శేఖర రెడ్డి టీడీపీ నుంచి గెలిస్తే , 1994లో భూమా నాగిరెడ్డి, 1999లో భూమా శోభా నాగిరెడ్డిలు టీడీపీ నుంచి విజయం సాధించారు. అయితే 2004లో భూమా నాగిరెడ్డి టీడీపీ పోటీ చేసి ఓడిపోగా, 2009లో శోభా నాగిరెడ్డి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2014లో శోభానాగిరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రమాదవశాత్తు మరణించగా, ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.

 

ఆ తర్వాత వెంటనే వచ్చిన ఉపఎన్నికల్లో నాగిరెడ్డి-శోభాల కుమార్తె అఖిలప్రియ వైసీపీ తరుపున గెలిచారు. అయితే నెక్స్ట్ నాగిరెడ్డి, కుమార్తెతో కలిసి టీడీపీలోకి వచ్చేశారు. ఇక నాగిరెడ్డి కూడా అనారోగ్యంతో మరణించారు. తర్వాత అఖిలప్రియ చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసి, 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.

 

వైసీపీ నుంచి గంగుల బిజేంద్ర రెడ్డి 35 వేల మెజారిటీతో గెలిచి, ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ఆధిపత్యానికి చెక్ పెట్టారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బిజేంద్ర..దూకుడుగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. యువనాయకుడుగా నియోజకవర్గంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నియోజకవర్గంలోనే సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అటు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే చేస్తున్నారు.

 

కొత్తగా సి‌సి రోడ్లు, అండర్ డ్రైనేజ్, సచివాలయ నిర్మాణాలు చేపట్టారు. ఇక ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు సక్రమంగా ప్రజలు అందేలా చేస్తున్నారు. అటు త్రాగునీటి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నారు. ఇటీవలే ఉయ్యాలవాడ మండలంలో త్రాగునీటి పైపులు వేయించారు.ఇక పార్టీ పరంగా కూడా బిజేంద్ర యాక్టివ్‌ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రత్యర్ధిగా ఉన్న అఖిలప్రియకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు.

 

అయితే ఓడిపోయాక అఖిలప్రియ ఫుల్ యాక్టివ్‌గా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. అటు వైసీపీ ప్రభుత్వంపై, ఇటు ఎమ్మెల్యే బిజేంద్రపై గట్టిగానే పోరాడుతున్నారు. అలాగే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే స్పందిస్తున్నారు. పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలని కూడా విజయవంతంగా చేస్తున్నారు. అఖిలప్రియ దూకుడుగానే ఉన్నా...ప్రస్తుతానికి ఆళ్లగడ్డలో బిజేంద్ర స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు. కానీ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీకి గట్టి పట్టు ఉండటంతో అఖిల ఎప్పుడైనా పుంజుకునే అవాకాశాలున్నాయి. కాబట్టి బిజేంద్ర ఈ నాలుగేళ్ళు ఇంకా స్ట్రాంగ్‌గా నిలదొక్కుకోవాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: