త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 100 శాతం ఇప్పుడున్న మంత్రులని పక్కనబెట్టేసి కొత్తవారికి అవకాశం కల్పించాలని జగన్ సిద్ధమయ్యారని చెప్పారు. త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని జగన్ తనకు చెప్పారని బాలినేని అన్నారు. అందరూ సి‌ఎం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పేశారు. అంటే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని తేలిపోయింది.

ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు క్యాబినెట్ బెర్త్ ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఉన్నారు...ఈ ముగ్గురు బదులు మరో ముగ్గురుకు అవకాశం దక్కనుంది. కాపు వర్గానికి చెందిన పేర్ని నాని సైడ్ అయితే అదే వర్గానికి చెందిన సామినేని క్యాబినెట్‌లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సామినేని టీడీపీ వేవ్ ఉన్న 1999 ఎన్నికల్లోనే జగ్గయ్యపేటలో కాంగ్రెస్ తరుపున నిలబడి విజయం సాధించారు. 2004లో సైతం సత్తా చాటారు. 2009లో ఓడిపోయిన సామినేని... 2014లో  వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2019 ఎన్నికల్లో మాత్రం జగన్ వేవ్‌లో భాను సూపర్ విక్టరీ కొట్టారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రిపదవి వస్తుందని ఆశ పెట్టుకున్నారు...కాకపోతే సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా మొదటి విడతలో ఛాన్స్ దక్కలేదు. ప్రభుత్వ విప్ పదవి మాత్రం దక్కగా, ఈ సారి మాత్రం సామినేనికి బెర్త్ ఖాయమైపోయిందని టాక్. ఇక ఎమ్మెల్యేగా కూడా సామినేని పర్వాలేదనిపించేలా పనిచేస్తున్నారు.


జగ్గయ్యపేటలో ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికల పోరులో కూడా వైసీపీకి అద్భుత విజయాలు అందించారు. అటు టీడీపీ నేత శ్రీరామ్ తాతయ్య కూడా యాక్టివ్‌గానే ఉన్నారు. జగ్గయ్యపేట ఎలాగో టీడీపీకి కంచుకోటగా ఉంది. తాతయ్య ఇంకాస్త గట్టిగా కష్టపడితే జగ్గయ్యపేటలో టీడీపీ పుంజుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో సామినేనికి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: