భట్టి విక్రమార్క...తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న నేత. 19990 కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పి‌సి‌సి ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, పి‌సి‌సి సెక్రటరీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక వైఎస్సార్ సపోర్ట్‌తో 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం వచ్చింది. 2009లో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి భట్టి గెలిచారు. అలాగే ఉమ్మడి ఏపీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు.

ఇక తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో కూడా మధిరలో భట్టి ఎమ్మెల్యేగా గెలిచేశారు. ఐదేళ్ల పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలిలో కూడా భట్టి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే మళ్ళీ కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయినా సరే పార్టీ కోసం భట్టి కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా పనిచేస్తున్నారు. అధికార టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఇక నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటూ, వారి సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండటంతో అనుకున్న విధంగా పనులు జరగడం లేదు. కానీ తనకు సాధ్యమైన మేర భట్టి పనులు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ప్రజల్లోనే ఉండటం వల్ల భట్టిపై అంతగా వ్యతిరేకత రాలేదు. అటు అధికార బలాన్ని ఉపయోగించుకుని బలపడటానికి టీఆర్ఎస్ నేత కమల్ రాజు ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉండటంతో నియోజకవర్గంలో పనులు చేయించగలుగుతున్నారు. అలాగే కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకులని తన వైపుకు తిప్పుకున్నారు.

అయితే ఇక్కడ అనుకున్న మేర టీఆర్ఎస్ బలపడినట్లు కనిపించడం లేదు. పైగా ఇక్కడ కనబడకుండా టీడీపీ క్యాడర్ ఉంది...ఆ క్యాడర్ భట్టికి సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ప్రస్తుతానికైతే మధిరలో భట్టికి పెద్దగా ఇబ్బంది లేదు. పైగా రోజురోజుకూ టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి...నెక్స్ట్ ఎన్నికల్లో భట్టికి నాలుగోసారి గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: