బాలీవుడ్ బాద్ షాకు ఈ మద్య అస్సలు కలిసి రావడం లేదు.  ఆయన నటించిన చెన్నైఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత వరుసగా ఫ్లాపులు చవి చూస్తున్నారు. ఈ మద్య రిలీజ్ అయిన ‘జీరో’సినిమా కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేక పోయింది.  అయితే ఈ సినిమాలో షారూక్ చేసిన ప్రయోగానికి మాత్రం మంచి ప్రశసంలు దక్కాయి.  నటుడిగా ఆయనకు ఎంతో మంచి పేరు వచ్చింది.  అయితే మొదటి నుంచి ఈ సినిమాపై పెట్టుకున్న ఆశలు మాత్రం అందుకోలేక పోయింది.  సినీ పరిశ్రమలో ఇలాంటి హిట్స్, ఫ్లాప్స్ కామన్ గా తీసుకునే షారూఖ్ మరో ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. 
Image result for SHAHRUKH KHAN
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ లకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు.  తెలుగు లో మహానటి సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది.  ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్, కాంతారావు బయోపిక్ ఇలా వరుసగా రాబోతున్నాయి.  బాలీవుడ్ లో సంచలన హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ‘సంజు’సినిమా తీశారు.  త్వరలో అబ్దుల్ కలాం సినిమా కూడా రాబోతుంది.  ఈ నేపథ్యంలో తొలి భారతీయ వ్యోమగామి 'రాకేశ్ శర్మ' జీవితం ఆధారంగా మూవీ తీయబోతున్నారు. 
Image result for RAKESH SHARMA
ఇందులో ప్రధాన పాత్రలో షారూఖ్ ఖాన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తునాయి. ఈ సినిమాకి 'సెల్యూట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. భారీ బడ్జెట్ తో సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, మహేశ్ మతాహి దర్శకత్వం వహించనున్నాడు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ కోసం ముంబై ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నారట. త్వరలో అఫిషియల్ గా అన్ని వివరాలు చెబుతామంటున్నారు చిత్ర యూనిట్. 


మరింత సమాచారం తెలుసుకోండి: